
అగ్ర నటుడు జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. హైదరాబాద్లో జరుగుతున్న ఓ యాడ్ షూట్లో ఆయన కాలికి స్వల్పంగా గాయమైంది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో అనుకోకుండా కిందపడటంతో ఆయనకు గాయమైంది. తక్షణమే వ్యక్తిగత సిబ్బంది ఆయన్ను దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని అధ్యయనం చేసిన వైద్యులు రెండువారాలు విశ్రాంతి అవసరమని సూచించారు. ఈ మేరకు ఎన్టీఆర్ టీమ్ ఈ ప్రమాదంపై ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యంపై వస్తున్న అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మొద్దు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.
















