Namaste NRI

ఆ కల ఓజీతో నెరవేరింది

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా సుజిత్‌ దర్శకత్వంలో రూపొందిన ఓజీ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందు కొచ్చింది. నిర్మాత డీవీవీ దానయ్య.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీవీవీ దానయ్య మాట్లాడుతూ ఈ ఆనందంలో నాకు మాటలు రావడం లేదు. ఈ సినిమా విషయంలో నేను త్రివిక్రమ్‌కు థాంక్స్‌ చెప్పాలి. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్‌ లేదు. పవన్‌కల్యాణ్‌తో సినిమా చేద్దామనుకున్నప్పుడు దర్శకుడు సుజిత్‌ పేరును త్రివిక్రమ్‌ సూచించారు. పవన్‌కల్యాణ్‌ అభిమానులకు నచ్చే సినిమా అందించాలనే ఉద్దేశంతో ఎంతో శ్రద్ధతో ఈ సినిమా తీశాం అన్నారు. ఈ సినిమాకు అద్భుతమైన టీమ్‌ కుదిరిందని, ఈ విజయం తమ ఆనందాన్ని రెట్టింపు చేసిందని ఆయన చెప్పారు.

దర్శకుడు సుజిత్‌ మాట్లాడుతూ దాదాపు మూడేళ్ల ప్రయాణమిది. పవన్‌కల్యాణ్‌ వల్లే ఈ కథకు ఇంతటి భారీతనం వచ్చింది. నేను ఆయన వీరాభిమానిని. జానీ టైంలో ఆయన్ని ఓసారి కలిస్తే చాలనుకునేవాడిని. కానీ ఈ రోజు ఆయనతో తీసిన సినిమాకు బ్లాక్‌బస్టర్‌ టాక్‌ రావడం ఆనందంగా ఉంది అన్నారు. ఎక్కడ చూసిన ఓజీ హంగామా కనిపిస్తున్నదని, ప్రజలు ఈ సినిమాను బాగా ఓన్‌ చేసుకున్నారని, ఈ విజయంతో భవిష్యత్తులో మరింత బాధ్యతగా పనిచేస్తానని సంగీత దర్శకుడు తమన్‌ పేర్కొన్నారు. ఈ సినిమా పంపిణీలో తాము ఓ భాగమని, ఈ సినిమా చూసిన అభిమానులు 12 ఏళ్ల ఆకలి తీరిందని చెబుతుంటే సంతోషంగా ఉందని నిర్మాత నాగవంశీ అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events