రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటించిన హిందీ హారర్ కామెడీ చిత్రం థామా. ఆదిత్యా సర్పోత్థార్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని మాడాక్ ఫిల్మ్స్ సమర్పణలో దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రష్మిక మందన్న మాట్లాడుతూ నేను ప్రతీ సినిమాలో పాత్రలపరంగా కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్నా. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంది. గొప్ప బాధ్యతతో ఈ చిత్రాన్ని పూర్తి చేశా అని చెప్పింది. ఆద్యంతం ఉత్కంఠను కలిగించే కథతో ఈ సినిమాను తెరకెక్కించారని, సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ కథ అందరికి నచ్చుతుందని రష్మిక పేర్కొంది.

ఫిలిం ప్రమోషన్ కోసం హైదరాబాద్ రావడం ఇదే తొలిసారి అని, తాను ప్రతీ సినిమాకు కొత్త కాన్సెప్ట్‌ను ఎంచుకుంటానని, థామా ఇప్పటివరకూ రాని భిన్నమైన కథతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని హీరో ఆయుష్మాన్ ఖురానా తెలిపారు. ఈ చిత్రం అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకురానుంది.ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
















