ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాల పరీక్షలు న్యూ ఇంగ్లాండ్‌లోని బోస్టన్‌లో విజయవంతంగా పూర్తయ్యాయి. న్యూ ఇంగ్లాండ్ రీజినల్ కో ఆర్డినేటర్ మౌనిక మానికొండ ఆధ్వర్యంలో నిర్వహించిన కళాశాల పరీక్షలకు ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ కృష్ణ ప్రసాద్ సోంపల్లి ఇన్విజిలేటర్‌గా వ్యవహరించారు. మన సంప్రదాయాలు పెంపొందిస్తున్న తానా కళాశాల ప్రోగ్రాం అందరకీ స్ఫూర్తి దాయమని కృష్ణప్రసాద్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి న్యూ ఇంగ్లాండ్ ఆరు రాష్ట్రాలు నుంచి వచ్చిన విద్యార్థులకు కో -ఆర్డినేటర్ మౌనిక్ మానికొండ కృతజ్ఞతలు తెలిపారు. తానా కళాశాల చైర్మన్ శ్రీమతి మాలతి, తానా ప్రెసిడెంట్ డాక్టర్ నరేశ్ కొడాలి తీసుకొచ్చిన పరీక్షా విధానంలో మార్పులు వల్ల అన్ని తరగతుల వారికి ప్రేరణ కలుగుతోందని తానా తెలిపింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న తానా కళాశాలలో కూచిపూడి, భరతనాట్యం, కర్ణాటక సంగీత కోర్సులకు అమెరికాలో ప్రాచుర్యం ఉన్న విషయం తెలిసిందే.
















