
అగ్రరాజ్యం అమెరికా, పాకిస్థాన్ మధ్య కొత్త బంధం ఏర్పడింది. అరుదైన ఖనిజాల ఎగుమతి అంశంలో రెండు దేశాలు తమ అగ్రిమెంట్‌ను అమలు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన స్ట్రాటజిక్ మెటల్స్ శాఖ, పాక్ ప్రభుత్వం మధ్య సెప్టెంబర్‌లో ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం అరుదైన ఖనిజాలకు చెందిన తొలి షిప్మెంట్ అమెరికాకు బయలుదేరినట్లు తెలుస్తోంది. అమెరికా కంపెనీ సుమారు 500 మిలియన్ల డాలర్ల పెట్టుబడితో పాకిస్థాన్‌లో మినరల్ ప్రాసెసింగ్, డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఖనిజాల సరఫరా దేశాల్లో పాకిస్థాన్ కీలక పాత్ర పోషించినున్నట్లు ఈ నేపథ్యంలో అమెరికా ప్రకటన చేసింది.















