బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు క్రూయిజ్ షిఫ్ డ్రగ్స్ కేసులో బెయిల్ మంజురైంది. దాదాపు 25 రోజులపాటు జైల్లో ఉన్న ఆర్యన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆర్యన్‌తో పాటు మరో ఇద్దరు నిందితులు అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ దమేచాలకు కూడా బెయిల్ లభించింది. అక్టోబర్ 2న ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ సేవిస్తూ ఆర్యన్‌ఖాన్ నార్కొటిక్స్ బ్యూరో అధికారులకు పట్టుబడ్డారు. కేసులో ఎన్సీబీ అధికారుల విచారణ పూర్తయిన అనంతరం ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ వేశాడు. ముందుగా రెండు కింది కోర్టులు ఆర్యన్ బెయిల్ పిటిషన్‌లను ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. నేటి సాయంత్రానికి వివరంగా ఉత్తర్లువు జారీ చేస్తాను జస్టిస్ సాంబ్రే తెలిపారు. ఇకా పూర్తి ఉత్తర్వులు రాకపోవడంతో నేడు లేదా రేపు అర్యన్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.