
రసాయన శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ పురస్కారం లభించింది. మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్‌లో (ఎంవోఎఫ్) కొత్తరకం మాలిక్యులార్ ఆర్కిటెక్చర్‌ను అభివృద్ధి చేసినందుకు గానూ శాస్త్రవేత్తలు సుసుము కిటాగవా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం యాఘీలకు స్టాక్‌హోంలోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ పురస్కారాలను ప్రకటించింది. జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీలో కిటాగవా ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్లో రాబ్సన్ సేవలు అందిస్తున్నారు. ఇక, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో యాఘీ విధులు నిర్వహిస్తున్నారు.
















