కాలిఫోర్నియాలోని శాక్రమెంటో తెలుగు సంఘం (టీఏజీఎస్) ఆధ్వర్యంలో యూఏఎన్ మూర్తి స్మారక 4వ రచనల పోటీలు జరగనున్నాయి. విదేశాలలో ఉన్న తెలుగు వారు తమ కథ, కవితలను ఈ పోటీకి పంపించవచ్చు. ప్రవాసులు తమ రచనలను కు పరిశీలన కోసం పంపవచ్చు. కవితలు, రచనలు 2021 నవంబర్ 30వ తేదీలోగా పంపాల్సి ఉంటుంది. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన వారికి ప్రథమ బహుమతిగా 116 డాలర్లు, ద్వితీయ బహుమతి 58 డాలర్లు, తృతీయ బహుమతిగా 28 డాలర్లు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.