కరోనా నేపథ్యంలో విధించిన ప్రయాణ ఆంక్షలను తొలగిస్తున్నట్లు ఇటీవల అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీసాల జారీ విషయమై ఆ దేశ దౌత్యాధికారిణి ఒకరు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే వీసా దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. స్టూడెంట్ వీసాలకు అమెరికా తొలి ప్రాధాన్యం ఇవ్వనుందని ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ)తో భేటీ అయిన కోల్‌కతాలోని యూఎస్ కాన్సుల్ జనరల్ మెలిందా పవేక్ పేర్కొన్నారు. అమెరికా ప్రయాణ ఆంక్షలను తొలిగిస్తున్నట్లు ప్రకటించిన దరిమిలా వీసాల కోసం నవంబర్ 1వ తేదీ నుంచి అపాయింట్‌మెట్స్ ప్రారంభమవుతాయి. స్టూడెంట్ వీసాలకే ప్రాధాన్యం ఉంటుందని ఆని ఆమె అన్నారు. 2021లో ఇప్పటికే 62 వేల మంది భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం వీసాలు మంజూరు చేసిందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక నవంబర్ 8తో ఆంక్షలన్ని తొలగిపోనున్నాయి కనుక అప్పటి నుంచే అన్ని వీసాల దరఖాస్తులు ప్రారంభమవుతయాని పవేక్ తెలిపారు.