Namaste NRI

అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ నుంచి ఫస్ట్ సాంగ్ కన్నోదిలి కలనొదిలి

వినూత్న కథా చిత్రాలతో మెప్పించే అల్లరి నరేష్‌ తాజాగా యాక్షన్‌ థ్రిల్లర్‌ 12ఏ రైల్వే కాలనీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. నాని కాసరగడ్డ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. డాక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌ షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం విడుదలకానుంది. మ్యూజికల్‌ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టారు. కన్నొదిలి కలనొదిలి అనే పాటను విడుదల చేశారు.

కన్నొదిలి కలనొదిలి కనుపాపే ఉంటుందా..నిన్నొదిలి నేకదిలి కాసేపైనా ఉంటానా అంటూ చక్కటి భావాలతో ఈ పాట ఆకట్టుకుంది. భీమ్స్‌ సిసిరోలియో స్వరపరచిన ఈ పాటను హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ ఆలపించారు. ఈ పాటలో నాయకానాయికలు అల్లరి నరేష్‌, కామాక్షి భాస్కర్ల మధ్య కెమిస్ట్రీ ప్రత్యేకాకర్షణగా నిలిచింది. సాయికుమార్‌, వైవా హర్ష, గెటప్‌ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, షోరన్నర్‌: డాక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌, దర్శకత్వం: నాని కాసరగడ్డ.

Social Share Spread Message

Latest News