Namaste NRI

ఎవరూ ఊహించని ఓ సూపర్‌హీరో పరిచయం : సృజన గోపాల్‌

చాందినీ చౌదరి, సుశాంత్‌ యాష్కీ ప్రధాన పాత్రధారులుగా, వికాస్‌ దర్శకత్వంలో సృజన గోపాల్‌ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు, నటుడు తరుణ్‌భాస్కర్‌ క్లాప్‌ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. నిర్మాత మాట్లాడుతూ సైన్స్‌ ఫిక్షన్‌తో కూడిన డార్క్‌ కామెడీ జానర్‌లో ఈ సినిమా రూపొందిస్తున్నాం. ఇందులో సూపర్‌ నాచురల్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయి. ఆడియన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే కథ ఇది. ఈ సినిమా ద్వారా ఎవరూ ఊహించని ఓ సూపర్‌హీరోని పరిచయం చేస్తున్నాం. ఈ నెల చివరి వారం నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం అని తెలిపారు. జీవన్‌కుమార్‌, అజయ్‌ ఘోష్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి కెమెరా: జితిన్‌, సంగీతం: పవన్‌, నిర్మాణం: సహచారి క్రియేషన్స్‌.

Social Share Spread Message

Latest News