Namaste NRI

సచిన్‌ను కలిసిన మంత్రి నారా లోకేశ్‌ దంపతులు

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్య, ఐటీ ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌ కుటుంబ సభ్యులు కలిశారు. తన జీవితంలో ఇది ఒక ఫ్యాన్‌ భాయ్‌ మోమెంట్‌ అంటూ లోకేశ్‌ తెలిపారు. సచిన్‌ వినయం, మానవత్వం గురించి విన్నవన్నీ నిజమేనని, వాటిని ప్రత్యక్షంగా చూడటం గర్వకారణమని పేర్కొన్నారు. తరతరాల క్రికెటర్లకు ప్రేరణగా నిలిచిన సచిన్‌, కేవలం క్రికెట్‌ దేవుడిగానే కాకుండా మానవత్వానికి పత్రీక అని కొనియాడారు. అనంతరం ఐసీసీ చైర్మన్‌ జైషా ఫ్యామిలీతోనూ లోకేశ్‌ కుటుంబం భేటీ అయింది. క్రికెట్‌, యువత భాగస్వామ్యం, భారత క్రీడా భవిష్యత్తుపై చర్చలు జరిగాయన్నారు.

Social Share Spread Message

Latest News