Namaste NRI

మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న క్యూట్‌ మూవీ ఇది

విక్రాంత్‌, చాందినీ చౌదరి జంటగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ సంతానప్రాప్తిరస్తు. సంజీవ్‌రెడ్డి దర్శకుడు. మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మాతలు. హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.

ఫ్యామిలీ ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తోకూడిన ప్యూర్‌ లవ్‌స్టోరీ ఇదని, ఓ సోషల్‌ ఇష్యూని జత చేసి వినోదాత్మకంగా సినిమాను తెరకెక్కించామని, సాంకేతికంగా సినిమా ఉన్నత ప్రమాణాలతో ఉంటుందని దర్శకుడు సంజీవ్‌రెడ్డి చెప్పారు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న క్యూట్‌ మూవీ ఇదని, ఈ సినిమాకు పనిచేసిన వారంతా మనసుపెట్టి పనిచేశారని, ఎక్కడా తాము ఖర్చుకు వెనుకాడలేదని నిర్మాతలు తెలిపారు. ఓ మంచి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందని, సంతానలేమి అనే సమస్యను తీసుకొని వినోదాత్మకంగా, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ సినిమా రూపొందించారని హీరోయిన్‌ చాందినీ చౌదరి చెప్పింది. ఈ నెల 14న విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events