జపాన్ లోని టోక్యో నగరంలో వుంటున్న తెలుగు వారు తెలుగు సంసృతిని పండుగలను కలిసి జరుపుకోవడంలో ముందు వుంటారు.కార్తీక మాసం సందర్భంగా అందరూ కలిసి వనభోజనా చేయడం ఆనవాయితీగా వస్తుంది, కావున టోక్యో నగరంలో వుంటున్న తెలుగు వారు ఎప్పటిలాగే ఈసారి కూడా కలిసి కార్తీక మాస వనభోజనాలను ఏర్పాటు చేశారు. హిగాషీ ఒజిమా లోని కొమట్సుగవ పార్క్ లో ఘనంగా నిర్వహించారు.


పిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహంగా గడిపారు. ఉదయం 11 నుండి సాయంత్రం 4 వరకు, పెద్దలు తాడుతో టగ్ ఆఫ్ వార్ గేమ్స్ ఆడగా పిల్లలు ఆట పాటలతో ఉత్సాహంగా గడిపారు. పాట్ శాకాహార భోజనంతో వన భోజనాలు ఎంతో రుచికరంగా ఆరగించారు.ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అసోసియేషన్ అధ్యక్షుడు , కమిటీ సభ్యులు, మరియు వాలంటీర్స్ కు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.




















