Namaste NRI

క్రేజీ మూవీ చెన్నై లవ్‌ స్టోరీ

కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం చెన్నై లవ్‌స్టోరీ. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీగౌరి ప్రియ కథానాయిక. ఈ చిత్రాన్ని సాయిరాజేష్‌, ఎస్‌కేఎన్‌ నిర్మిస్తున్నారు. కథానాయిక శ్రీగౌరిప్రియ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ ఇదని, చెన్నై నేపథ్యంలో సాగుతుందని, హృదయాన్ని స్పృశించే ఈ ప్రేమకథలో సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కథ: సాయిరాజేష్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రవి నంబూరి.

Social Share Spread Message

Latest News