
హెచ్-1బీ వీసా (H-1B Visa)కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చిందని వార్తలు వెలువడుతున్న క్రమంలో ట్రంప్ కార్యనిర్వాహకవర్గ వైఖరిని ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బేసెంట్ వివరించారు. ఇక నుంచి హెచ్-1బీ వీసాపై వచ్చే విదేశీయులు ఇక్కడ ఉద్యోగాలు చేయరని, అమెరికన్లను శిక్షణ ఇవ్వడమే వారి ఉద్యోగమని, నిపుణులైన కార్మికులను అమెరికా రప్పించడం, అమెరికన్లకు వారితో శిక్షణ ఇప్పించడం, తర్వాత వారిని వారి దేశాలకు పంపడం ఇదే తమ కొత్త విధానం అని పేర్కొన్నారు. ‘ఇక్కడ అధ్యక్షుడి దార్శనికత ఏమిటంటే ఈ ఉద్యోగాలు ఎక్కడికి వెళ్లాయో, ఆయా నైపుణ్యాలు ఉన్న విదేశీ కార్మికులను తీసుకువచ్చి యూఎస్ కార్మికులకు శిక్షణ ఇప్పించిన తర్వాత మూడు, ఐదు, ఏడు సంవత్సరాల తర్వాత విదేశీ కార్మికులు ఇంటికి వెళ్లవచ్చు. తర్వాత యూఎస్ కార్మికులే పూర్తి బాధ్యత తీసుకుంటారు అని ఆయన పేర్కొన్నారు.















