
జ్యోతిపూర్వజ్, పూర్వజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కిల్లర్. పూర్వజ్ దర్శకుడు. పద్మనాభరెడ్డి నిర్మాత. ఈ చిత్రం నుంచి ఫైర్ అండ్ ఐస్‌అనే పాటను విడుదల చేశారు. ఐదు పాత్రల చుట్టూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముడిపడిన కథాంశమిది. ప్రతీ పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. కథానాయిక జ్యోతి పూర్వజ్ ఐదు డిఫరెంట్ రోల్స్‌లో కనిపిస్తుంది.సాంకేతికంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించే చిత్రమవుతుంది అని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలోని విజువల్స్, పాటలు ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తాయని నిర్మాత పద్మనాభరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు తెలుగు సినిమాలో రాని కంటెంట్ ఇదని నాయకానాయికలు పేర్కొన్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: జగదీశ్ బొమ్మిశెట్టి, సంగీతం: అశీర్వాద్, సుమన్ జీవ, నిర్మాతలు: పూర్వజ్, పద్మనాభరెడ్డి ఏ, రచన, ఎడిటింగ్, దర్శకత్వం: పూర్వజ్.
















