
అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, సంయుక్తా మేనన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం అఖండ 2. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా అఖండ చిత్రానికి ఈ చిత్రం సీక్వెల్‌గా రాబోతుంది. ఈ నేపథ్యంలోనే చిత్రం నుంచి జాజికాయ జాజికాయ అనే మాస్ పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, తమన్ సంగీతం అందించాడు. బ్రిజేష్ శాండిల్య, శ్రేయా ఘోషల్ కలిసి పాడారు. అఖండ 2ను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
















