
స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తనకి కాబోయే భార్య హరిణ్యా రెడ్డికు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. రాహుల్ సిప్లిగంజ్ రెండు రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు.ఈ నెల 27వ తేదీన హరిణయను పరిణయమాడబోతున్నాడు.వీరి వివాహ వేడుకకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారు.వీరి పెళ్లికి మరో రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. తాజాగా సంగీత్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. సంగీత్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న ఈ సమయంలో రాహుల్ ఇచ్చిన సర్‌ప్రైజ్‌కి హరిణ్య తెగ ఫిదా అయింది.టీమ్‌ఇండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహాల్‌ని స్వయంగా సంగీత్ వేడుకకు ఆహ్వానించి, తన కాబోయే భార్యకు రాహుల్ స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు. చాహాల్‌ను చూసి హరిణ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
















