Namaste NRI

తాను కనుక ఎన్నికల్లో విజయం సాధిస్తే.. ప్రతి హెచ్‌-1బీ వీసాదారుడిని తొలగిస్తా!

తాను కనుక ఎన్నికల్లో విజయం సాధిస్తే ఫ్లోరిడాలో పనిచేస్తున్న ప్రతి హెచ్‌-1బీ వీసాదారుడిని ఉద్యోగం నుంచి తొలగిస్తానని 2026లో జరిగే గవర్నర్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జేమ్స్‌ ఫిష్‌బాక్‌ ఓటర్లకు హామీనిచ్చారు. మాజీ డోజ్‌ ఆర్కిటెక్ట్‌, హెడ్జ్‌ ఫండ్‌ వ్యవస్థాపకుడు అయిన జేమ్స్‌ హెచ్‌-1బీ వీసాల ద్వారా అమెరికన్లకు జరుగుతున్న అన్యాయాన్ని తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ప్రతిభావంతులైన అమెరికన్లను కాదని కొన్ని అమెరికన్‌ కంపెనీలు భారతీయులు, చైనీయులను నియమించుకుంటూ హెచ్‌-1బీ స్కామ్‌కు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు.

తాను కనుక గవర్నర్‌గా విజయం సాధిస్తే అర్హులైన ఫ్లోరిడావాసులకు బదులుగా ఇతర దేశస్థులను నియమించుకుంటున్న కంపెనీల కాంట్రాక్టులన్నీ రద్దు చేస్తానని హామీనిచ్చారు. ట్రంప్‌ మద్దతు ఇచ్చిన రిపబ్లికన్‌ అభ్యర్థి ప్రతినిధి బైరాన్‌ డొనాల్డ్స్‌ను లక్ష్యంగా చేసుకుని కూడా జేమ్స్‌ విమర్శలు గుప్పించారు. ఆయన కార్పొరేట్‌ల ప్రయోజనాల కోసం అమెరికన్‌ కార్మికుల ప్రయోజనాలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌ నినాదం భారతీయుల వల్లో, చైనీయుల వల్లో సాకారం కాదని, కేవలం అమెరికన్ల వల్లే అది సాధ్యపడుతుందని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events