
ఇటీవల సంభవించిన దిత్వా తుఫాన్ కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం చవిచూసిన శ్రీలంకకు భారత ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తోంది. ఇప్పటికే సహాయక బృందాలను పంపిన భారత్ పొరుగు దేశానికి మరింత సాయం చేసేందుకు సిద్దమైంది. లంక అధ్యక్షుడు అరుణు కుమర్ దిస్సనాయకే తో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌లో మాట్లాడారు. ఆపరేషన్ సాగర్ బంధు కింద శ్రీలంకకు మరింత సాయం అందిస్తామని మోడీ హామీ ఇచ్చారు. తుఫాన్ ధాటికి సంభవించిన వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు భారత ప్రధాని. పొరుగు దేశమైన శ్రీలంకను చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఆ దేశంలో దిత్వా తుఫాన్ సృష్టించిన విలయం అంతాఇంతా కాదు. ఈ విపత్కర పరిస్థితుల్లో శ్రీలంకకు భారత ప్రభుత్వం అన్నివిధాలా సాయం అందిస్తామని మోడీ హామీ ఇచ్చారు.















