
చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వం షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంగీత ప్రయాణం ఫస్ట్ సింగిల్ మీసాల పిల్లతో అద్భుతంగా ప్రారంభమైంది. ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ హిట్ తర్వాత, మేకర్స్ ఇప్పుడు సెకండ్ సింగిల్ అప్‌డేట్‌తో వచ్చారు. సెకండ్ సింగిల్ శశిరేఖ. ప్రోమో ఈనెల 6న విడుదల అవుతుంది. లిరికల్ వీడియో ఈనెల 8న విడుదల అవుతుంది. పోస్టర్‌ను బట్టి చూస్తే, ఈ పాట కలర్ ఫుల్ విజువల్ ట్రీట్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న వెంకటేష్ తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్నారు. ప్రొడక్షన్ పూర్తయ్యే దశకు చేరుకుంది. వచ్చేఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కెమెరా సమీర్‌రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: శ్రీమతి అర్చన, నిర్మాతలు : సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, నిర్మాణం: షైన్ స్క్రీన్స్ అండ్ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్స్, దర్శకత్వం: అనిల్ రావిపూడి.
















