
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 సదస్సు నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ట్రంప్ మీడియా టెక్నాలజీస్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సదస్సు వేదికగా కంపెనీ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ ఈ విషయాన్ని ప్రకటించారు. రానున్న పదేళ్లలో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. గత కొన్ని నెలలుగా మమ్మల్ని తెలంగాణకు ఆహ్వానిస్తునే ఉన్నా కుదరలేదని, ఆలస్యం జరిగిందన్నారు. తెలంగాణ ముఖ్యముంత్రి రేవంత్ రెడ్డి మా పెట్టుబడులను ఆహ్వానించారని, ఇక్కడ అభివృద్దికి గొప్ప అస్కారం ఉండడంతో చివరికి రాక తప్పలేదన్నారు. భారత దేశంలో అద్భుతమైన నైపుణ్య మానవ వనరులు ఉన్నాయని, ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఇండియానే పెద్దన్నగా కనబడుతుందన్నారు. ఇది ఎవరికి కనబడడం లేదని, ఇండి యా రైజింగ్ రాబోయే పదేళ్లలో భారతదేశం ప్రపంచ టెక్నాలజీ రంగంలో ముందుంటుందని చెప్పారు.
















