Namaste NRI

కీలక ప్రకటన చేసిన యూఎస్ విదేశాంగ శాఖ

డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వలసలను నియంత్రించేందుకు పలు కఠిన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 85 వేల వీసాలను అమెరికా రద్దు చేసింది. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఒక ప్రకటన చేసింది. సరిహద్దు భద్రత, వలస పర్యవేక్షణకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, విదేశాంగ కార్యదర్శి మార్క్ రుబియో ఒకే లక్ష్యాన్ని అనుసరిస్తున్నారని విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రక్రియ ఆగదని పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events