
రుక్మిణి వసంత్ పరిచయం అవసరం లేని పేరు. కాంతార 1 సినిమా విడుదలకు ముందు వరకు రుక్మిణి వసంత్ పేరు చాలామందికి తెలియదు కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఈమె పేరు మారుమోగి పోయింది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార1 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రుక్మిణి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఒకవైపు సౌత్ సినిమాలలో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగులు వేయటానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పలు బాలీవుడ్ సినిమాలకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ సందర్భంగా రుక్మిణి వసంత్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి నాకు హిందీ చాలా సుపరిచితమైన భాష అని తెలిపారు. ప్రస్తుతం ఒక బాలీవుడ్ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని, భగవంతుడి దయతో త్వరలోనే ఆ సినిమా పనులు ప్రారంభం అవుతాయని భావిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. దీంతో అమె ఇప్పటికే ఓ హిందీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అభిమానుల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.















