Namaste NRI

భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్‌ రిలీజ్

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిషోర్‌ తిరుమల దర్శకత్వం.  ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. అషికా రంగనాథ్‌, డింపుల్‌ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు. టీజర్‌ను విడుదల చేశారు.

ఆద్యంతం హాస్యప్రధానంగా ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో టీజర్‌ ఆకట్టుకుంది. రవితేజ తన సమస్యని ఓ సైకాలజిస్ట్‌కు చెప్పుకోవడం, అతను ఇచ్చే సలహాలు, వాటి చుట్టూ పండే వినోదంతో టీజర్‌ సాగింది. వెన్నెల కిషోర్‌, మురళీధర్‌ గౌడ్‌, సత్య పాత్రలు వినోదాన్ని పంచాయి. రవితేజ తనదైన శైలి కామెడీతో మెప్పించారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఏఎస్‌ ప్రకాష్‌, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, రచన-దర్శకత్వం: కిషోర్‌ తిరుమల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events