Namaste NRI

మా అంచనాలు నిజమయ్యాయి : టీజీ విశ్వప్రసాద్‌

రోషన్‌ కనకాల కథానాయకుడిగా సందీప్‌రాజ్‌ దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా థాంక్స్‌మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో సాయిదుర్గతేజ్‌ అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తన ఫేవరేట్‌ క్యారెక్టర్‌ అయిన మోగ్లీ పేరుతో ఈ సినిమా రావడం ఆనందంగా ఉందని, రోషన్‌ కష్టపడి కెరీర్‌ను బిల్డ్‌ చేసుకుంటున్నారని అన్నారు. మోగ్లీ చిత్రానికి విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి ఆదరణ లభిస్తున్నదన్నారు.  ఈ సినిమా తమ అంచనాల్ని నిజం చేసిందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ పేర్కొన్నారు. ఈ సినిమా కోసం తాను వందశాతం ఎఫర్ట్స్‌ పెట్టానని హీరో రోషన్‌ కనకాల అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events