Namaste NRI

మన శంకరవరప్రసాద్ గారు ..మెగా విక్టరీ మాస్ సాంగ్ కు ముహూర్తం ఫిక్స్

సంక్రాంతికి రాబోతున్న చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారు సినిమాపై ఆడియన్స్‌లో ఉన్న అంచనాలు అంతాఇంతాకాదు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్‌ అతిథి పాత్ర పోషించిన విషయం విదితమే. ఇప్పటికే విడుదలైన రెండు పాటలూ జనబాహుళ్యంలో బాగా వినిపిస్తున్నాయి. ఈ నెల 30న ఈ సినిమాకు చెందిన మూడో పాటను విడుదల చేయనున్నట్టు ఓ ప్రకటన ద్వారా మేకర్స్‌ తెలియజేశారు. చిరంజీవి, వెంకటేశ్‌ కాంబినేషన్‌లో రూపొందిన ఈ మెగా విక్టరీ మాస్‌ సాంగ్‌ రెండు తెలుగు రాష్ర్టాల్లో రెండు వారాలకు ముందే సంక్రాంతి సందడి తీసుకురానున్నదని మేకర్స్‌ తెలిపారు. దీనికి సంబంధించిన ప్రోమోను రేపు విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో చిరంజీవి, వెంకటేశ్‌లిద్దరూ ైస్టెలిష్‌ డాన్స్‌ పోజుల్లో ఫుల్‌ జోష్‌తో కనిపించారు. సెలబ్రేషన్‌ వైబ్‌ క్రియేట్‌ అయ్యేలా ఈ పోస్టర్‌ ఉన్నది. ఈ పాటతో కొత్త సంవత్సర వేడుకను మొదలుపెట్టబోతున్నామని మేకర్స్‌ తెలిపారు. జనవరి 12న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, నిర్మాణం: షైన్‌ స్క్రీన్స్‌, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events