హైస్కూల్ డిప్లొమా లేదా అంత కన్న తక్కువ చదువుకున్న 60 ఏళ్ల పైబడిన ప్రవాసుల వర్క్ పర్మిట్లను పునరుద్ధరించకూడదని తీసుకున్న నిర్ణయాన్ని కువైత్ ప్రభుత్వం రద్దు చేసింది. దీనికోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన డెసిషన్ నెం 520/2020ను క్యాన్సిల్ చేసింది. అలాగే ఇకపై ఈ కేటగిరీ ప్రవాసులు తమ పర్మిట్లను రెన్యువల్ చేసుకోవడానికి ఏడాదికి 500 కువైటీ దినార్లు (రూ.1.23 లక్షలు) ఫీజుగా చెల్లించాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో 60 ఏళ్లు దాటిన ప్రవాసులు 65వేలకు పైగా ఉన్నారని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రకటన వచ్చిన తర్వాత వలసదారుల పర్మిట్లను పునరుద్ధరించడానికి ఆటోమేటెడ్ సిస్టమ్‌ను తీసుకురానున్నారు. .
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)