Namaste NRI

అనగనగా ఒక రాజు ట్రైలర్‌ రిలీజ్

నవీన్‌ పొలిశెట్టి నటిస్తున్న చిత్రం అనగనగా ఒక రాజు. మారి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. ట్రైలర్‌ను విడుదల చేశారు. అనగనగా ఒక రాజు..ఆ రాజుకి చాలా పెద్ద మనసు. ఆ మనసులోకి ధగధగా మెరిసిపోయే నగలు వేసుకొని యువరాణి దిగింది అంటూ నాగార్జున వాయిస్‌ ఓవర్‌తో మొదలైన ట్రైలర్‌ ఆసాంతం వినోదాత్మకంగా సాగింది. జమీందారి మనవడు రాజు పాత్రలో నవీన్‌ పొలిశెట్టి నవ్వుల్ని పంచారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కలర్‌ఫుల్‌ విజువల్స్‌తో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భం గా నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ ఈ సంక్రాంతికి ఇంటిల్లిపాదిని నవ్వించేలా ఈ సినిమా రూపొందించాం. ప్రేక్షకుల్ని నాన్‌స్టాప్‌గా నవ్విస్తుంది. అదే సమయంలో భావోద్వేగాలతో ఆకట్టుకుంటుంది అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ట్రైలర్‌ మాదిరిగానే సినిమా మొత్తం పంచ్‌లు, వ్యంగ్యంతో నవ్విస్తుంది. పండగకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి అన్నారు. హీరో నవీన్‌ను కొత్తగా చూస్తారని, ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్యారెంటీ అని దర్శకుడు మారి పేర్కొన్నారు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్‌, దర్శకత్వం: మారి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events