
భారత్, పాకిస్థాన్ మధ్య అణ్వాయుధ యుద్ధాన్ని ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తెలిపారు. ఆ రెండు దేశాల మధ్య సమరాన్ని నివారించడం వల్ల కోట్లాది మంది ప్రాణాలను కాపాడినట్లు ఆయన పేర్కొన్నారు. రెండోసారి అమెరికా దేశాధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది కాలంలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన మీడియాకు వివరించారు. ఓ దశలో తన అంచనా ప్రకారం భారత్, పాక్ అణుదాడి చేసేందుకు సిద్దమైనట్లు ట్రంప్ పేర్కొన్నారు. 10 నెలల్లోనే 8 యుద్ధాలను ఆపినట్లు ఆయన తెలిపారు. ఎన్నటికీ ముగింపులేని యుద్ధాలను నివారించానని, కంబోడియా-థాయ్‌ల్యాండ్ మధ్య ఎన్నో ఏళ్లుగా యుద్ధం జరుగుతోందని, కొసావో-సెర్బియా, కాంగో-రువాండ, ఇండియా-పాక్ మధ్య గొడవలను పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు. ఇండియా, పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని, 8 యుద్ధ విమానాలు కూలిపోయాయని, ఓ దశలో ఆ రెండు దేశాలు మధ్య అణుదాడి జరిగే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

ఆ రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగేది.. కానీ నేను ఆపకుంటే భారత్, పాక్ మధ్య అణుయుద్ధం జరిగేది














