హ్యూస్టన్లో సంప్రదాయ గ్రామీణ వాతావరణాన్ని తలపింజేస్తూ తెలుగు వారి సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక గ్రేటర్ హ్యూస్టన్ ప్రాంతంలోని తెలుగు ప్రజలను ఒక వేదికపై కలిపి, భారతీయ సంస్కతి, వారసత్వాన్ని గుర్తుచేసింది. తెలుగు సంప్రదాయ వేషదారణలో హాజరైన తెలుగు వారు గంగిరెద్దుల ఊరేగింపు, కోలాటం, భోగి మంటలు వంటి మన సంప్రదాయాలను స్మరింపజేసే కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


సంక్రాంతి సంబరాలు, మన తెలుగు వైభవం కార్యక్రమానికి కనకం బాబు, అంజనేయులు కోనేరు, జితేందర్ రెడ్డి, శ్రీధర్ కన్చనకుంట్ల, పూర్ణ లంక, మురళీ, పద్మశ్రీ ముత్యాల, లక్ష్మీ, అనురాధ, స్నేహలత రెడ్డి, ఆశాజ్యోతి, హనుమాన్ దత్త యోగా సెంటర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సహకరించారు.


పాంగల్ వంటల ఆతిథ్యం అందరి మనసును దోచుకుంది. హనుమాన్ దత్త యోగా సెంటర్లో కార్యక్రమం కోసం ఆవరణం తీర్చిదిద్దిన విధానం ఆకర్షణగా నిలిచింది. అందమైన అలంకరణలు, సంప్రదాయ సంక్రాంతి పాటలు, రంగుల ముగ్గులు కలసి ఉత్సవ ఉల్లాసాన్ని రెట్టింపు చేశాయి. పిల్లలు, యువత, పెద్దలు పాల్గొని మన తెలుగు సంస్కతిలోని ఆనందాన్ని ఆస్వాదించారు. మహిళలు కోలాటం, ముగ్గులు కార్యక్రమాల్లో పాల్గొని మన సమూహ జీవన శైలిని, సంప్రదాయాలను స్పురింపజేశారు.















