Namaste NRI

కీరవాణి గాత్రంలో వెళ్లేదారిలో.. శ్రీ చిదంబరం నుంచి మెలోడీ సాంగ్ విడుదల

వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటిస్తున్న వింటేజ్‌ విలేజ్‌ డ్రామా శ్రీచిదంబరం. వినయ్త్న్రం దర్శకుడు. చింతా వినీషరెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానున్నది. వెళ్లేదారిలో  అనే మెలోడీ సాంగ్ తాజాగా విడుదలైంది. ఈ పాటకు చంద్రశేఖర్‌ సాహిత్యం అందించగా, చందు రవి స్వరపరిచారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈ పాటను ఆలపించడం విశేషం. నిర్మాతలు మాట్లాడుతూ తన గానంతో ఈ పాటకు ప్రాణం పోశారు కీరవాణి. ఇదొక అందమైన ప్రేమకథ. సహజత్వం ఉట్టిపడేలా కథ, కథనాలు ఉంటాయి. హీరోను అసలు పేరుతో కాకుండా చిదంబరం అని ఊరిజనాలు ఎందుకు పిలుస్తున్నారు? హీరో కళ్లద్దాలు ఎప్పుడూ ఎందుకు పెట్టుకుని ఉంటాడు? ఈ ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానమే ఈ సినిమా కథ అని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events