
భారత్‌తో ఒక సమగ్ర ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉందని యూరోపియన్ యూనియన్ తెలిపింది. ఈయూ బృందం భారత్ పర్యటన సమయంలో ఈ ఒప్పందం కుదిరే అవకాశముందని ఈయూ విదేశాంగ, భద్రతా విధానాల ప్రతినిధి కాజా కల్లాస్ తెలిపారు. యూరోపియన్ పార్లమెంట్‌లో ఆమె మాట్లాడారు. భారత్- ఈయూ మధ్య 16వ శిఖరాగ్ర సమావేశం దిల్లీలో జరగనుంది. రిపబ్లిక్ డేకు ప్రత్యేక ఆహ్వానితులుగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియా కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లియన్ వస్తున్నారు. ఈ పర్యటనలోనే భారత్–ఈయూ వ్యూహాత్మక అజెండాను ఆమోదించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాజా కల్లాస్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.















