
శర్వానంద్ కథానాయకుడిగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ నారీ నారీ నడుమ మురారి. రామ్ అబ్బరాజు దర్శకుడు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతు న్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సంక్రాంతి విన్నర్ బ్లాక్‌బస్టర్ ఈవెంట్‌లో శర్వానంద్ మాట్లాడారు. థియేటర్లలో అందరూ హాయిగా నవ్వుకుంటూ సినిమా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు రామ్ అబ్బరాజు భవిష్యత్‌లో చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. జంధ్యాల, ఈవీవీల స్థానం ఇక ముందు ఇతనిదే. థియేటర్లు పెరిగాయి. ఈ సినిమా ఇక్కడితో ఆగదు. మరో నాలుగు వారాలు అద్భుతంగా ఆడుతుంది. విజయం విలువ ఏంటో నాకు తెలుసు. అలాంటి విజయాన్ని నిర్మాత అనిల్ ఈ సినిమాతో నాకిచ్చారు. అందుకే చెబుతున్నా. హీరో, నిర్మాత కలిసుంటే ఏమవుతుందో మేం చూపిస్తాం. ఆయనతో నెక్ట్స్ సినిమా చేస్తున్నా. మళ్లీ అనిల్ పెద్ద సినిమా చేసేవరకూ ఆయన్ని రూపాయి అడగను. ఇది నా ప్రామిస్ అన్నారు. ఇంకా ఏపీ ఎంపీ కేశినేని నానితో పాటు చిత్రబృందమంతా మాట్లాడారు.















