సిక్కోలు రథసప్తమి ఉత్సవాల చివరి రోజున, ప్రముఖ సంగీత దర్శకులు ఎస్.ఎస్ తమన్ మరియు వారి బృందం ఆధ్వర్యంలో సాగిన లైవ్ మ్యూజిక్ కార్యక్రమం పండగ ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. సంగీతం, ఆనందం మరియు ఉత్సాహభరితమైన వేడుకలతో నిండిన ఈ సాయంత్రం హాజరైన ప్రతి ఒక్కరి ఉత్సాహాన్ని పెంచింది.ఈ ఉత్సాహానికి కారణంగా మారిన తమన్ గారికి, వారి బృందానికి శ్రీకాకుళం ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. బాణసంచా వెలుగులు, డ్రోన్ షో లతో ఉత్సవం మరింత ఉన్నత స్థాయికి చేరింది. విరామం లేని వినోదాన్ని సిక్కోలు వాసులు పొందినందుకు ఆనందంగా ఉందన్నారు.


ఎమ్మెల్యే గొండు శంకర్ , ఎంపీ విజయనగరం కలిశెట్టి అప్పలనాయుడు , కలెక్టర్ శ్రీ స్వప్నిల్ దినకర్ , నటులు ఆది , అశ్విన్ మరియు అశేష జనసందోహం మధ్య ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. రథసప్తమి వేడుక రానున్న రోజుల్లో సూర్యునిలా దేశవ్యాప్తంగా ప్రకాశించి, తీర్థయాత్రికులను ఆకర్షించి, శ్రీకాకుళం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తుందని నమ్ముతున్నాను అన్నారు .




















