Namaste NRI

మెలానియా డాక్యుమెంటరీ.. ప్రీమియర్‌ షోకు ఏఆర్‌ రెహమాన్‌

అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ రూపొందించిన మెలానియా డాక్యుమెంటరీ ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై హాట్ టాపిక్‌గా మారింది. ఈ డాక్యుమెంటరీ జనవరి 30 నుంచి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శించబడుతున్న తరుణంలో, వాషింగ్టన్ డీసీలోని ప్రతిష్టాత్మక కెన్నడీ సెంటర్ లో ఈ డాక్యూమెంట‌రీ ప్రీమియ‌ర్‌ను ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. అయితే ఈ హై-ప్రొఫైల్ ఈవెంట్‌కు భారతీయ సంగీత మాంత్రికుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ప్రత్యేక అతిథిగా ఆహ్వానం అందుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో రెహమాన్ కు ఉన్న విశేష గుర్తింపు నేపథ్యంలో ఆయనను ఈ వేడుకకు ఆహ్వానించిన‌ట్లు తెలుస్తుంది. ప్రముఖ దర్శకుడు బ్రెట్ రాట్నర్ తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీలో మెలానియా ట్రంప్ వ్యక్తిగత జీవితం, ఆమె ఎదుర్కొన్న సవాళ్లు మరియు వైట్ హౌస్‌లో గడిపిన కీలక ఘట్టాలను చూపించ‌బోతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events