Namaste NRI

టీ20లో టీమ్ ఇండియా ఘన విజయం

అఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో న్యూజిలాండ్‌పై భారత్‌ అతికష్టం మీద విజయం సాధించింది. దీంతో టీ20 ప్రపంచకప్‌లో ఆ జట్టు చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది.

                జయపుర వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్‌ ఘన విజయం సాధించింది. వరుసగా ఏడు ఓటముల తర్వాత భారత జట్టు విజయఢంకా మోగించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ మార్టిన్‌ గప్తిల్‌ (70), మార్క్‌ చాప్‌మ్యాన్‌ 963) రాణించడంతో 20 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. 165 పరుగుల లక్ష్య చేధనలో భారత్‌కు కేఎల్‌ రాహుల్‌ (15), రోహిత్‌ శర్మ (48) శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన సూర్యాకుమార్‌ యాదవ్‌ (62) కీలక ఇన్సింగ్స్‌ ఆడాడు. చివర్లో శ్రేయాస్‌ అయ్యర్‌ (5), వెంకటేష్‌ అయ్యర్‌ (4) వెంటవెంటనే పెవిలియన్‌ చేరడంతో ఉత్కంఠ నెలకొంది. మూడు బంతుల్లో మూడు పరుగులు కావాల్సిన పరిస్థితులో ఫోర్‌ కొట్టిన రిషబ్‌ పంత్‌ (17) భారత్‌కు విజయాన్నందించాడు. కివీస్‌ బౌలర్లలో కెప్టెన్‌ టిమ్‌ సౌధీ, శాంట్నర్‌, డారియల్‌ మిచెల్‌ తలో వికెట్‌ పడగొట్టగా.. ట్రెంట్‌ బౌల్ట్‌ రెండు వికెట్లు కూల్చాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events