విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రంగస్వామి నాయుడు(63) తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఆయన బాధ పడుతున్నారు. తిరుపతిలో నివాసం ఉంటున్న రంగస్వామికి తీవ్ర గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. చికిత్స తీసుకుంటున్న క్రమంలోనే పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. రంగస్వామి నాయుడు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఆయనకు భార్య కాంతమ్మ ఉన్నారు. రంగస్వామి నాయుడు మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, రైతులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.














