Namaste NRI

ఈ పెయింటింగ్ ధర రూ.260 కోట్లు

ఏమైనా సరే కొంచెం కష్టపడితే మంచి విజ్ఞాన వంతుడుకావచ్చు. అయితే కళాకారుడుగా కావాలంటే మాత్రం అది దేవుడిచ్చిన వరం అంటారు పెద్దలు. అందుకనే మన సమాజంలో కళాకారులను గౌరవిస్తాం. వారి ప్రతిభకు పట్టం గడతాం. ఎన్ని సంవత్సరాలు అయినా కళాకారుడిని గుర్తు చేసుకుంటూనే ఉంటాయి. తాజాగా ఒక ప్రఖ్యాత కళాకారిణి వేసిన పెయింటింగ్‌ ఏకంగా కోట్లలో అమ్ముడు పోయింది. తాజాగా మెక్సికన్‌ దిగ్గజ కళాకారిణి ఫ్రిదా కహ్లో వేసిన అరుదైన పెయింటింగ్‌ న్యూయార్క్‌ వేలంలో దాదాపు 35 మిలియన్‌ డాలర్లకు (సుమారు 260 కోట్లు) అమ్ముడుపోయింది. అయితే ఈ చిత్రం గొప్పతనమేమిటంటే కళాకారిణి ఫ్రిదా తన స్వీయ చిత్రాన్ని తానే చిత్రించడమే కాక ఆ చిత్రంలో తన భర్త డియెగో రివెరా ముఖం తన నుదిటి పై ప్రతిబింబించేలా చిత్రిస్తుంది. పైగా ఈ పెయింటింగ్‌లో ఆమె విలక్షణమైన కనుబొమ్మలతో చీకటి కళ్ళపై నుండి కొన్ని కన్నీటి చుక్కలు వస్తున్నట్లు చిత్రించింది. అయితే కాదు ఫ్రిదా ఈ పెయింటింగ్‌ని తన భర్త డియెగో వై యో పేరుతో చిత్రించడం గమనార్హం.

                 అయితే ఆమె భర్త డియోగో రివెరా మెక్సికన్‌ నటి ఫెలిక్స్‌లో సన్నిహితంగా మెలగడంతోనే ఆమె ఈ విధంగా తన భర్త ముఖాన్ని తన నుదిటపై మూడవ కన్నుగా చిత్రీకరించిందంటూ కొంతమంది కళాకారులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఈ పెయింటింగ్‌ అతను ఆమె ఆలోచనలను ఏ స్థాయిలో హింసించాడో అనేదాన్ని కూడా సూచిస్తుందని అంటున్నారు. ఈ మేరకు ఈ పేయింటింగ్‌ చరిత్రలో వేలంలో అత్యంత ఖరీదకు అమ్ముడుపోయిన లాటిన్‌ అమెరికా కళాకృతిగా నిలిచింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events