అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. టెన్నెస్సీలోని మెంఫిస్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్న కుకీ షాప్‌లో ప్రముఖ ర్యాపర్యంగ్ డాల్ఫ్‌పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 36 ఏండ్ల యంగ్ డాల్ఫ్ చికాగోలో జన్మించాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన బంధువులను చూసేందుకు డాల్ఫ్ మెంఫిస్‌కు వచ్చాడని, అప్పుడు ఓ గుర్తు తెలియని వ్యక్తి డాల్ఫ్‌పై కాల్పులకు తెగబడినట్లు అతని సోదరి మరెన్నో మయర్స్ తెలిపారు. కాగా, ఈ ర్యాపర్ పై గతంలోనూ కాల్పులు జరిగాయి. 2017, సెప్టెంబర్‌లో లాస్ఏంజెల్స్లో అతడిపై కాల్పులు చేశారు. అదే ఏడాది ఫిబ్రవరిలోనూ యంగ్ డాల్ఫ్‌పై కాల్పులుకు పాల్పడ్డారు.
ఆయన అసలు పేరు అడాల్ఫ్ రాబర్ట్ థోర్నటన్. 2008 నుంచి ర్యాపర్‌గా కెరీర్ ప్రారంభించాడు. గతేడాది అతడు రూపొందించిన రిచ్ స్లేవ్ ఆల్బమ్‌కు బిల్డోర్డ్ టాప్ 200 లిస్ట్‌లో స్థానం లభించింది. పేపర్ రూట్ కాంపేన్, కింగ్ ఆఫ్ మెంఫిస్, రిచ్ స్లేవ్, తదితర ఆల్బమ్స్ ప్రజాదరణ పొందాయి.














