తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాకు చెందిన మండలి శేఖర్ (25) అనే యువకుడు అమెరికాలో మృతి చెందాడు. గుర్రంపోడు మండలం తీర్థపల్లి గ్రామానికి చెందిన శేఖర్ రెండేండ్ల క్రితం ఉపాధి కోసం అమెరికా వెళ్లాడు. నవంబర్ 19న ఇల్లికాట్ పట్టణంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. తీర్థపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొడుకు మరణ వార్తను ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహం స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)