Namaste NRI

డొనాల్డ్ ట్రంప్ కు అరుదైన గౌరవం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అరుదైన గౌరవం దక్కింది. దక్షిణ కొరియా దిగ్గజ మార్షల్‌ ఆర్ట్స్‌ సంస్థ కక్కివొన్‌ ట్రంప్‌ను 9వ ర్యాంక్‌ డాన్‌ బ్లాక్‌బెల్ట్‌తో సత్కరించింది. ఈ సంస్థ అధ్యక్షుడు లీ డాంగ్‌ సియోప్‌ అమెరికా ఫ్లోరిడాలోని ట్రంప్‌ నివాసానికి వెళ్లి అవార్డును స్వయంగా అందజేశారు. ధ్రువపత్రాన్ని కూడా అందించారు. ట్రంప్‌నకు తైక్వాండో పట్ల ఆసక్తి ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని డాంగ్‌ సియోప్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. బ్లాక్‌ బెల్టు అందుకున్న అనంతరం ట్రంప్‌ ఆనందం వ్యక్తం చేశారు. వెంటనే బెల్టు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. ఈ గౌరవం తనకు దక్కినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆత్మరక్షణకు తైక్వాండో గొప్ప మార్షల్‌ ఆర్ట్‌ అని ట్రంప్‌ ప్రశంసించారు. భవిష్యత్తులో మళ్లీ అమెరికా అధ్యక్షుడినైతే ఈ బ్లాక్‌బెల్టు ధరించి కాంగ్రెస్‌ (శాసనసభ)కు హాజరవుతానని వ్యాఖ్యానించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events