రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్). ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన దోస్తి, నాటు నాటు పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా మేకర్స్ మరో క్రేజ్ అప్‌డేట్ అందించారు. నవంబర్ 26న ఆంథెమ్ సాంగ్ జననీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. బావోద్వేగపూరిత అనుభవాన్ని అందించేందుకు రెడీ అంటూ మేకర్స్ తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు రోల్‌లో రాంచరణ్ నటిస్తుండగా, కొమ్రంభీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ సీత పాత్ర పోషిస్తుండగా, హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మొర్రీస్ ఎన్టీఆర్‌కు జోడిగా నటించనుంది. బాలీవుడ్ హీరో అజయ్‌దేవ్‌గన్, సముద్రఖని, శ్రియా శరణ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2022 జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)