ఆదిపత్యవాదానికి, పవర్ పాలిటిక్స్‌కు చైనా ముమ్మాటికీ వ్యతిరేకమని చైనా అధినేత షీ జిన్‌పింగ్ అన్నారు. ఆసియాన్, చైనా మధ్య సంబంధాలకు 30 ఏళ్లు నిండాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సదస్సు నిర్వహించారు. ఆగ్నేయ ఆసియా దేశాల అసోసియేషన్ (ఆసియాన్) సభ్యుల వర్చువల్ సదస్సులో జిన్‌పింగ్ మాట్లాడారు. ఆగ్నేయ ఆసియాపై ఆధిపత్యాన్ని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. పొరుగున్న ఉన్న చిన్న దేశాలపై పెత్తనం చెలాయిస్తూ అదుపులో పెట్టుకోవాలని ఆశించడం లేదని వెల్లడిరచారు. పొరుగు దేశాలకు స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆగ్నేయా ఆసియాలోని దేశాలన్నీ కలిసి ఈ ప్రాంతంలో శాంతిని కాపాడుకోవాలన్నదే తమ ఆకాంక్ష అని అన్నారు. మరో దేశంపై ఆధిపత్యం చెలాయించడం చైనా విధానం కాదన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)