ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు సమస్య కాని సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ తెరమీదకు తీసుకొచ్చారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి విమర్శించారు. బీపేజీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంతో కుదిరిన ఒప్పందం మేరకు రాష్ట్రంలో ప్రతి గింజనూ కొంటామని స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఫలితం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కేంద్రంపై టీఆర్‌ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం, రైల్‌రోకో లాంటి కార్యక్రమాల్లో పాల్గొనని సీఎం లేని సమస్యలపై కేంద్రం విష ప్రచారానికి ధర్నా చేస్తున్నారని విమర్శించారు.
ఢల్లీిలో చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని, మరి రాష్ట్రంలో గత ఏడున్నరేళ్లలో చనిపోయిన, ఆత్మహత్యలకు ప్పాలడిన రైతుల కుటుంబాలను ఆదుకోరా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన యువత, ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల్లో ఏ ఒక్క కుటుంబాన్ని అయినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదుకుందా అని నిలదీశారు. ఎస్సీలకు పారిపాలన సత్తా లేదన్న అర్థం వచ్చేలా దళిత సీఎం విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలున్నాయి. జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు పెంచలేకపోయిన టీఆర్‌ఎస్‌పై గిరిజనులు యుద్ధం చేయాలి. ఏడున్నరేళ్లుగా 40 వేల ఉపాధ్యా ఉద్యోగాలను భర్తీ చేయలేదు. ఎంఎంటీఎస్‌కు నిధులివ్వకుండా యాదాద్రి వరకు విస్తరణ ప్రాజెక్టును తొక్కిపెట్టారని అని విమర్శించారు.