దుబాయ్‌లో జరుగుతున్న ఎక్స్‌ప్లో 2020 షోకి హాజరయ్యే వారికి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఎక్స్‌ప్లోలో ఇండియన్ పెవిలియన్‌కి హాజరయ్యే వారికి రౌండ్ ట్రిప్ విమాన టిక్కెట్లు ఫ్రీగా ఆఫర్ చేస్తోంది. ఎక్స్‌ప్లో 2020కి సంబంధించి ఇండియన్ పెవిలియన్‌కి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించే ఇండియన్ పెవిలియన్ చేరుకున్న వారు తమ బోర్డింగ్ పాసులను అక్కడే ఏర్పాటు చేసిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (ఏఐఈ) కియోస్క్‌లో వేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రతీ నెల లక్కీ డ్రా తీసి ఇద్దరు విజేతలకు ప్రీ విమాన ప్రయాణాన్ని ఆఫర్ ఏఐఈ చేస్తోంది.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లక్కీడ్రాలో విజేతలు ఇండియాలో ఈ రెండు నగరాల మధ్య అయినా ఉచితంగా ఒకసారి ప్రయాణం చేయవచ్చు. అయితే ఆ నగరాల మధ్య ఏఐఈ సర్వీసులు ఉండాలనే కండీషన్‌ను విధించింది. దుబాయ్ ఎక్స్‌ప్లో మొత్తం పన్నెండు అంశాలతో ఇండియన్ పెవిలియన్ ఏర్పాటు చేశారు. దుబాయ్ ఎక్స్‌ప్లో 2020 అంగరంగ వైభవంగా జరుగుతోంది. గడిచిన 50 రోజుల్లో సుమారు 3.50 లక్షల మంది ఈ ఎక్స్‌ప్లోను సందర్శించారు. ఇండియా నుంచి కూడా ఎంట్రప్యూనర్లు, స్టార్టప్‌లు పెట్టిన వారు ఇందులో పాల్గొంటున్నారు.