
బ్రిటన్ వీసా ఫీజులు భారీగా పెరిగాయి. ఈ నెల 1 నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. దీంతో యూకే పర్యటన మరింత భారం కానున్నది. 6 నెలల వీసాగా పిలుచుకునే స్టాండర్డ్ యూకే విజిటర్ వీసా ఫీజు రూ.12,190 నుంచి రూ.13,462కు, లాంగ్‌టెర్మ్ విజిటర్ వీసా ఫీజు రూ.45,792కు పెరిగాయి. ఐదేండ్లు (రూ.81, 726), పదేండ్ల (రూ.1.02లక్షలు) వీసా ఫీజుల్ని కూడా యూకే భారీగా పెంచింది. వీసా లేకుండా దేశంలోకి ప్రవేశం కల్పించే ఈటీఏ ఫీజును రూ.1,060 నుంచి 1,696కు పెంచింది. ఈ సదుపాయాన్ని కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం చేసింది. వ్యాపారం నిమిత్తం, కుటుంబ సభ్యుల్ని కలుసుకునేందుకు, సెలవుల్ని గడిపేందుకు భారతీయులు ఎక్కువ సంఖ్యలో యూకేలో పర్యటిస్తుంటారు.
