హిజ్బొల్లాకు వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటంలో ఇజ్రాయెల్‌కు భారీ షాక్ తగిలింది. ఆ దేశానికి చెందిన ఆరుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ లెబనాన్‌లో జరిగిన పోరాటంలో ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. లెబనాన్‌లో హిజ్బొల్లాకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మరణించిన ఇజ్రాయెల్ సైనికుల సంఖ్య 47కి పెరిగింది. ఓ గ్రామంలో జరిగిన దాడిలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఐడీఎఫ్ తెలిపిన వివరాల ప్రకారం ఓ గ్రామంలోని నలుగురు సైనికులు దాడి ప్రారంభించారు.

ఈ క్రమంలో ఓ భవనంలో ఉన్న నలుగురు హిబ్బొల్లా యోధులు సైనికులపైకి కాల్పులు జరుపడంతో అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ సైన్యం జరిపిన ప్రతీకార దాడిలో నలుగురు హిజ్బొల్లా వారియర్స్ సైతం మరణించారు. నలుగురు సైనికులు గోలానీ బ్రిగేడ్‌లోని 51వ బెటాలియన్‌కు చెందిన సైని కులని ఐడీఎఫ్ పేర్కొంది. ఇంతకు ముందు అక్టోబర్ 2న లెబనాన్‌లో జరిగిన దాడిలో ఎనిమిది మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ మాట్లాడుతూ హిజ్బొల్లాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఉదాసీనత పనికిరాదన్నారు.
