అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. అమెరికాలో పలు పదవులకు జరిగిన ఎన్నికల్లో భారతతి సంతతికి చెందిన వ్యక్తులు, డెమోక్రాట్లు తమ హవా కొనసాగించారు. యూఎస్ ఆర్థిక రాజధాని న్యూయార్క్, వర్జీనియాలో జరిగిన తాజా ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు, భారత సంతతికి చెందిన వ్యక్తులు విజయం సాధించారు.

న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ విజయం సాధించారు. ఈ ఘనత సాధించిన తొలి ముస్లిం, భారత సంతతి, ఆఫ్రికన్ సంతతికి చెందిన తొలి మేయర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. 34 ఏండ్ల మమ్దానీ జూన్‌లో జరిగిన డెమోక్రాటిక్ ప్రైమరీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మేయర్ అభ్యర్థిగా నిలిచారు. తాజాగా జరిగిన మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై మమ్దానీ విజయం సాధించారు.
















